Wednesday, November 6, 2024

పాకిస్థాన్, నైజీరియాల కన్నా భారతీయ జీతాలు తక్కువ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలో భారత దేశాల జీతాలు తక్కువ అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తెలిపారు. ఆయన ఓ గ్లోబల్ రిపోర్టు ఆధారంగా ఈ విషయం చెప్పారు. అభివృద్ధి చెందని దేశాలైన పాకిస్థాన్, నైజీరియా కన్నా భారత దేశంలో జీతాలు తక్కువ అని ఆయన పేర్కొన్నారు.

2024లో అతి తక్కువ జీతాలున్న 10 దేశాల చిత్రాన్ని షేర్ చేశారు. ‘వెలసిటీ గ్లోబల్ 2024’  ప్రకారం అత్యంత పేద దేశాలలో భారత్ కూడా ఉంది. భారత దేశంలో నెలసరి కనీస వేతనం  45 డాలర్లే(అంటే రూ. 3760.61). కాగా నైజీరియాలో 76 డాలర్లు(రూ. 6351.25), పాకిస్థాన్ లో 114 డాలర్లు(రూ. 9526.88) గా ఉంది.

ప్రధాని నరేంద్ర మోడీ కేవలం స్వప్నాలనే అమ్ముతున్నారని, జిడిపి వృద్ధిలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందని సొల్లు కబుర్లు చెబుతున్నారని, అదంతా వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని పవన్ ఖేరా ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ఇండియా కనీస వేతనం విషయంలో కేవలం శ్రీలంక(28 డాలర్లు), కిర్గిస్థాన్(28 డాలర్లు) కంటే మెరుగ్గా ఉందని తెలిపారు. ఇక బిజెపి దేశంలో నిరుద్యోగం విషయంలో కూడా ఏమి చేయడం లేదని విమర్శించారు.

‘‘ దేశంలో 7 శాతం జిడిపి వృద్ధి నమోదయినా యువతకు ఉపాధి కల్పించలేదని, మూల సమస్య అయిన నిరుద్యోగం విషయంలో మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు’ అని జైరామ్  రమేశ్ కూడా విమర్శించారు. దేశంలో 21 శాతం మందికే వేతనాల ఉద్యోగాలున్నాయి. ఇది కోవిడ్ కన్నా ముందున్న కాలంలో ఉన్న 24 శాతం కన్నా తక్కువ అని కూడా జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News