Friday, December 20, 2024

అజ్ఞాతం వీడిన పుతిన్..

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అజ్ఞాతం వీడారు. దేశంలో విఫల తిరుగుబాటు పరిణామాల తరువాత ఆయన తిరిగి కన్పించారు. వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంపై తిరుగుబాటుకు దిగింది. ఈ దశలో పుతిన్ సురక్షిత ప్రాంతానికి జారుకున్నడనే వార్తలు వెలువడ్డాయి. అయితే సోమవారం పుతిన్ యువ ఇంజనీర్లను ఉద్ధేశించి మాట్లాడటం ఇప్పుడు వీడియోగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీర్ ఆఫ్ ది ఫ్యూచర్ పేరిట ఏర్పాటు అయిన యూత్ ఫోరంలో పుతిన్ మాట్లాడారు.

దేశంలోని కంపెనీలు స్థిరమైన ఉత్పత్తి చర్యలతో దేశ రిశ్రమ రంగాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సైనిక తిరుగుబాటు క్రమంలో కన్పించకుండా పోయిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ తిరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని కన్పించారు. పలు వార్తలు కట్టుకథలని తిప్పికొట్టేందుకు యత్నించారు. సెర్గీ తమ సైనిక దుస్తులలో ఓ హెలికాప్టర్‌లో కన్పించారు. అక్కడ ఓ సైనిక బృందంతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరపడం, తన ముందున్న మ్యాప్‌లు పరిశీలించడం వంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News