Wednesday, January 22, 2025

కరోనా పరీక్షల కోసం తప్పని నిరీక్షణ

- Advertisement -
- Advertisement -
Waiting expectations for Covid-19 tests
జలుబు,దగ్గుతో ఆరోగ్య కేంద్రాలకు జనం పరుగులు
చలి తీవ్రతో వ్యాధులతో ప్రజలు అవస్థలు
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్షం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు

హైదరాబాద్: నగరంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో నగరవాసులు దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతూ వైరస్ సోకిదనే భయంతో స్దానికంగా ఉండే ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షణ చేస్తూ టెస్టుల కోసం నమూనాలు ఇస్తున్నారు. గత 20 రోజుల నుంచి వైద్య సిబ్బంది ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు కేంద్రాల వద్ద ఉంటూ వచ్చిన వారందరికి పరీక్షలు చేసి వ్యాధి నిర్దారణ చేస్తున్నారు. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో జనం రద్దీగా ఉండటంతో ఒక రోజు నమూనాలు, మరో రోజు ఫలితాలు వెల్లడిస్తున్నట్లు రోగులు పేర్కొంటున్నారు. దీంతో చాలామంది లక్షణాలున్న ప్రజ మధ్య దర్జాగా తిరుగుతూ ఇతరులకు సోకేలా చేస్తున్నారని వైద్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలున్న వారు హోంఐసోలేషన్‌లో ఉండాలని సూచనలు చేసిన పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. పాజిటివ్‌గా తేలితే వారికి కరోనా కిట్లు అందజేస్తున్నట్లు, పరిస్దితి తీవ్రంగా ఉంటే వెంటనే గాందీ, టిమ్స్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

రోజుకు 60 నుంచి 70మంది పరీక్షల కోసం వస్తున్నట్లు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. నగరంలో 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి పరీక్షల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు. మరో రెండు వారాల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని కేంద్రాలు సిబ్బంది చెబుతున్నారు. జనం రద్దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసినట్ల్లు పేర్కొంటున్నారు. ఈ మాసంలో పెళ్లి ముహూర్తాలు ఉండటంతో వైరస్ ఉనికి చాటే వాతావరణ ఉందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. థర్డ్‌వేవ్ కూడా పాఠశాలల నుంచి ప్రారంభమైందని, తాజాగా స్కూళ్లు ప్రారంభించడంతో నిర్వహకులు కోవిడ్ నిబంధనలు పాటించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తే మహమ్మారి వేగానికి కళ్లెం వేయవచ్చని వైద్యాధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News