Wednesday, April 2, 2025

బుమ్రా రిటర్న్ కోసం ఎదురుచూస్తున్నాం: మహేల

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్-2025లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.

అయితే ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు తీరని లోటుగా మారింది. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో బుమ్రా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోనే ఉంటున్నాడు. అయితే బుమ్రా ఎప్పుడు జట్టుతో జతకడతాడనే విషయంపై కోచ్ మహేల జయవర్ధనే స్పందించారు. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా ఎప్పుడు వస్తాడనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం జట్టులో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారని.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బుమ్రా ఫిట్‌నెస్ గురించి రోజు గమనిస్తునే ఉన్నామని అన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ.. అతని రిటర్న్‌పై ఎన్‌సిఎ నుంచి ఎలాంటి టైమ్‌లైన్ రాలేదని.. అందుకోసం వేచి చూస్తున్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News