Monday, December 23, 2024

కుల ధృవపత్రాలకోసం నిరీక్షణ

- Advertisement -
- Advertisement -

వేంసూరు : బిసిలకు లక్ష రూపాయలు రుణం సదుపాయం కల్పించేందుకు గాను ఈనెల 20వ తేదీ ఆఖరి తేదీ కావడంతో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు బిసి అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది. ధృవపత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయక రెవెన్యూ సిబ్బంది సతమతమవుతున్నారు.

ఈ విషయం తెలియని అభ్యర్థులు అటు తహసీల్దార్ కార్యాలయం, పెట్రోల్ మండల పరిషత్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ, మంగళవారంతో బిసి రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిస్తున్న దృష్ట్యా, ద్రవపత్రములు రాక, అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం గడువు తేదీ పొడిగించినట్లయితే బావుండేదని, దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండేదని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించుకొని కొందరు ఇంటి ముఖం పడుతున్నారు. మరికొందరు ధృవపత్రాలు అందక ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో కొట్టి మిట్టాడుతున్నారు.

కొందరు 20 రోజులు పైగా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని ఉన్నామని, తహసీల్దార్ కార్యాలయంలో ధృవ పత్రాలు ఇవ్వడంలో రెవెన్యూ శాఖ వారు జాప్యం చేస్తున్నారని, రెవెన్యూ వారితో వాదోపవాదాలకు దిగుతున్నారు. బిసి రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరో వారం రోజులు గడువు తేదీని పొడిగించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News