Monday, December 23, 2024

లక్షకు మించిన రుణాలు మాఫీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: ఇప్పటికే లక్షలోపు రుణా లు మాఫీ చేశామని ఇకపై లక్షకుపైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేసే ప్రక్రియలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంటే క్యాడర్ కోసం బిజెపి, అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వెతుకులాటలో ఉన్నాయని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్య క్తం చేశారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్‌కు వస్తున్నందున ప్రతి పల్లెపల్లె నుంచి ప్రజలు ఆనందోత్సవాల్లో తేలియాడుతూ సభకు విచ్చేయాలని కోరారు.  మెదక్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతులు రుణమాఫీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లే దని అకౌంట్ పనిచేయకుంటే తక్షణ చర్యలు తీసుకొని వారి కీ రుణమాఫీ అయ్యేలా చూస్తామన్నారు. ఈ నెల 23న జి ల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌తో పాటు ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించి అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ హయాంలో మాట ఇచ్చి తప్పినప్పటికీ మెదక్‌ను జిల్లా కేంద్రంగా చేసిన ఘనత బిఆర్‌ఏస్ ప్రభుత్వానిదేనని మంత్రి హరీశ్‌రావు అ న్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ కొత్త జి ల్లాల ఏర్పాటు చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో పరిపాలనను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. డు ఈ ప్రాంత వాసులకు జిల్లా కేంద్రమే ఆకాంక్షగా ఉండేదని దానిని నెరవేర్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జిల్లా కేంద్రం కలగానే మిగిలివుండేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల కల సాకారమైందని తెలిపారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో పట్టణ రూపురేఖలు కూడా మారడంతో పాటు మెదక్‌కు రైలు కూడా వచ్చిందని తెలిపారు.
సిఎం కెసిఆర్ పథకాలకు కాంగ్రెస్ బేజారు
సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ బేజారవుతుందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఏ విషయంలోనూ బిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ గానీ, అ టు బిజెపిగానీ పోటీపడే స్థితిలో లేదని, ప్రజలు కూడా వారి ని నమ్మే స్థితి ఏమాత్రం లేరని హరీశ్‌రావు అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని అందుకు సంబంధించిన టెండర్లను వచ్చే నెలలో వేయనున్నట్లు తెలిపారు. కేవలం తొమ్మిది ఏళ్లల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే సిఎం కెసిఆర్ వి జన్ అని, రాష్ట్రంలో మరోమారు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రి క్ కొట్టనున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు విఆర్‌ఎలను, ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల పట్టాలను ఇస్తున్నామని తద్వారా 1లక్ష 50వేల గిరిజన కుటుంబాలకు లబ్ధిచేకూరడంతో పాటు రైతుబీమా, రైతుబంధులాం టి పథకాలను వారికి వర్తింపపజేస్తూ ఆ భూములపై పూర్తి హక్కులను కల్పించామన్నారు. ఇప్పటికే రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయ్యిందని, ఎవరికైనా మాఫీ కాకపోతే బ్యాంకుల అధికారులతో చర్చలు జరిపి వారికి కూడా రుణమాఫీ చేయిస్తామని హామీనిచ్చారు. కోటి ఎకరాలతో తెలంగాణ సాగులోనే దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజల మధ్య ఉండే నాయకులు ఉన్నారని, ఇంటి ముందు అభివృద్ధి కంటి ముందు బిఆర్‌ఎస్ అన్న విధంగా ప్రభుత్వం కొనసాగుతుందని కొనియాడారు. 10వేల మంది మైనార్టీలకు ఒక్కో లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేస్తూ 100కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం రెండు మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఉండేవని ప్రస్తుతం వాటి సంఖ్య 204కు తెలంగాణ ప్రభుత్వం పెంచిందన్నారు. కాంగ్రెస్ కేవలం కెసిఆర్‌ను తి ట్టడానికే ఉన్నదని, కానీ కెసిఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఉన్నారని అన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్, బిజెపిలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు కెసిఆర్‌ను విమర్శించే పనిలో ఉంటే వడ్లు పండించే బిజీలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, పలువురు బిఆర్‌ఎస్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News