Wednesday, January 22, 2025

గత ఐదేళ్లలో తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నాం: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులను రుణాల నుంచి విముక్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడు విడతల్లో రైతుల రుణాలు మాపీ చేస్తున్నామని, గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని, ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ సరైన పద్ధతిలో చేయకున్నా ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని చురకలంటించారు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా రుణమాఫీ చేస్తున్నామని, ఎన్ని కష్టాలు ఉన్న రైతులకు రుణాలు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నామని వివరణ ఇచ్చారు. పాస్‌బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా రుణాలు మాఫీ చేస్తున్నామని తుమ్మల స్పష్టం చేశారు. రుణాలు మాఫీ కాకపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాంకేతిక కారణాల వల్ల కొన్ని రుణాలు మాఫీ కాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News