Monday, December 23, 2024

విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ

- Advertisement -
- Advertisement -

చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా డా.జ్యోతిబుద్ధప్రసాద్
రవాణ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు
రాహుల్ బొజ్జాకు రిజిస్ట్రేషన్, స్టాంపులు విద్యాశాఖ
కార్యదర్శిగా వాకాటి కరుణ ఔషధ నియంత్రణ
కమిషనర్‌గా అలీ ముర్తుజా రిజ్వీ, వి.శేషాద్రికి జిఎడి
కార్యదర్శిగా అదనపు బాధ్యతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా. జ్యోతి బుద్ద ప్రసాద్‌ను బదిలీ చేసి చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా నియమించింది. రవాణా శాఖ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఎఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు రిజిస్ట్రేషన్, స్టాంపులు, కమిషనర్‌గా, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రజారోగ్యం, కుటుంబ సం క్షేమ కమిషనర్ వి.కరుణ ను బదిలీ చేసి విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. హెచ్‌ఎంఅండ్‌ఎఫ్‌డబ్ల్లు కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రి జ్వీకి ఔషధ నియంత్రణ సంచాలకులుగా, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి కార్యదర్శి వి. శేషాద్రికి జిఎడి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News