- Advertisement -
న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభాన్ని ఉదహరిస్తూ మోడీ సర్కార్‌పై పీడీపీ చీఫ్ , జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బుధవారం విరుచుకుపడ్డారు. పొరుగు దేశంలో తలెత్తిన ఆర్థిక , రాజకీయ సంక్షోభం భారత్‌కు మేలుకొలుపు వంటిదని, వ్యాఖ్యానించారు. మైనార్టీలపై దాడుల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలతో మనం మేలుకోవాలని, 2014 నుంచి భారత్‌లో మత వైషమ్యాలు పెచ్చుమీరి భయపూరిత వాతావరణం రాజ్యమేలుతోందని అన్నారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు బనాయించడం కొనసాగిస్తే భారత్ పరిస్థితి శ్రీలంక కంటే దిగజారుతుందని మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు.
- Advertisement -