ప్రభుత్వ ఉత్తర్వులను బోర్డు ఉల్లంఘించింది
హోంమంత్రికి, మంత్రి కొప్పులకు ఫిర్యాదు చేసిన టిఎన్జీఓ నాయకులు
హైదరాబాద్: తెలంగాణ వక్ఫ్‌బోర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హోంమంత్రి మహమూద్ అలీకి, కొప్పుల ఈశ్వర్‌లకు టిఎన్జీఓ నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఎం.జగదీష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్)లు మంత్రులను కలిసి సమస్యలకు వారి దృష్టికి తీసుకొచ్చారు.
వక్ఫ్‌బోర్డులో ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారని, ప్రభుత్వ ఉత్తర్వులను బోర్డు ఉల్లంఘించిందని వారు మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్‌లు మాట్లాడుతూ ఏ ఉద్యోగికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, వక్ఫ్‌బోర్డు ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రులు టిఎన్జీఓ నాయకులకు హామినిచ్చారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్, ముజీబ్‌లు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఉద్యోగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం సహాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి, జిల్లా సభ్యుడు శంకర్ పాల్గొన్నారు.