కీవ్: ప్రపంచంలోని అగ్రస్థాయి స్నైపర్స్‌లో ఒకరైన ‘వాలి’ ఇప్పుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. యుద్ధ రంగంలో చేతిలో ఆయుధంతో శత్రువుల అంతుచూడగల ఘనుడు. శత్రు సైన్యానికి చిక్కకుండా, అధునాతన రైఫిల్స్‌తో బుల్లెట్ల వర్షం కురిపించగలడు. ఒక్క రోజులో కనీసం 40 మందిని చంపగలడు. రాయల్ కెనడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన వాలి, ఇప్పుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరడంతో ఉక్రెయిన్ సైన్యానికి కొత్త శక్తి లభించినట్టయింది. రష్యాపై పోరాడేందుకు విదేశీయులు వచ్చినా ఆయుధాలందిస్తాం అని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించడంతో స్పందించిన వాలి, ఉక్రెయిన్ సైన్యంలో చేరడానికి ముందుకు వచ్చాడు. సైన్యంలో చేరిన రెండు రోజుల్లోనే దాదాపు ఆరుగురు రష్యన్ సైనికులను చంపినట్టు సమాచారం. 2009-11మధ్య అఫ్గానిస్థాన్ యుద్దంలో వాలి పాల్గొన్నప్పుడు అక్కడి ఆఫ్గన్లను భారీ స్థాయిలో హతమార్చాడు. అప్పటి నుంచి అతడికి న్నైపర్‌గా గుర్తింపు వచ్చింది.
రస్యాపై పోరాటానికి నాతోపాటు మరికొందరు కెనడియన్ సైనికులు వస్తున్నారని వాలి చెప్పారు. అతడి అసలు పేరు వాలి కాదు. సైన్యంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పేరు. అరబిక్ భాషలో వాలి అంటే కాపాడేవాడని అర్థం.
Wali Joins Ukraine’s Army Fighting against Russia