Monday, December 23, 2024

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ (కల్వకుర్తి రూరల్ ) : మహనీయుల జీవితాల నుంచి ప్రేరణ పొంది వారు చూపిన మార్గం, వారి అడుగుజాడ ల్లో యువత నడువాలని నాగర్‌కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు అన్నారు. శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెహ్రూ యు వక కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన యువ ఉత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన యువ ఉత్సవ వేడుకల్లో ఎంపి రాములు మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అ ందించిన దార్శనికుడని అన్నారు.

నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తిని కొనసాగించాలని, యువ శక్తికి వివేకానంద జీవితం స్పూర్తి అని ఎం పి రాములు అన్నారు. భారత దేశ ఔనత్యాన్ని ప్ర పంచం గుర్తించేలా చేసిన గొప్ప తాత్వికుడు స్వా మి వివేకానంద అని ఆయన అన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తి కొనసాగించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. యువకులు గానే ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చునని అన్నారు. ఇంటర్మీడియ ట్ విద్య దశలోనే మీ జీవిత గమ్యాలను సాధించుకునేందుకు దిశా నిర్దేశం చేసుకోవాలని ఆయన వి ద్యార్థిని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి యువకులు కష్టపడాలని ఆయన అన్నారు.

* యువత లక్షాన్ని నిర్దేశించుకోవాలి మాజీ జాతీయ బిసి కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
విద్యార్థి దశ నుంచే యువత గొప్ప లక్షాలను ఎంచుకుని లక్షసాధన దిశగా నిరంతరం శ్రమించాలని జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి విద్యార్థిని విద్యార్థులకు సూచించా రు. నేటి యువత ఇంటర్నెట్ మాయజాలంలో పడి బంగారు భవితను చిత్రం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాన్ని తమకు అనుగుణంగా మలుచుకోవాలి తప్ప ఆ మాయలో పడవద్దని సూచించారు. ప్రైవేట్ కళాశాల మోజులు పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థి విద్యార్థులు ఆర్థికంగా చితిగిపోతున్నారని, ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఆయన అన్నారు.

లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఒకటి రెండు ర్యాంకులు సాధించి మామూల మధ్య తరగతి విద్యార్థులు తల్లిదండ్రులను ఆకర్షి ంచి ఆర్థికంగా వారి జీవితాలను గుల్ల చేస్తున్న ప్రైవేట్ కళాశాల ప్రకటనలు నమ్మవద్దని ఆయన హితువు పలికారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ సాం ప్రదాయం నేడు పల్లెలకు పాకిందని, యువత డ్ర గ్స్‌కు బానిసలు కావద్దని ఆయన అన్నారు. యువత సక్రమైన మార్గంలో నడవాలని ఆయన పేర్కొన్నారు. అంతర్జాలం మాయలో పడి మీలో ఉన్న సృజనను చంపుకుంటున్నారని ఆచారి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడిని ప్రపంచం మొత్తం గుర్తిస్తుందని అన్నారు.

ప్రపంచ దేశాల్లో భారత దేశానికి గొప్ప చరిత్ర ఉందని, ఆ ఘనత ప్రధాన నరేంద్ర మోడి మరింత ఉన్నతికి చేర్చారన్నారు. అనంతరం విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండూరు గోవర్ధన్, బిజెపి నాయకులు దుర్గా ప్రసాద్, కృష్ణ గౌడ్ నరసింహ, రవి గౌడ్, రా ఘవేందర్ గౌడ్, అధ్యాపకులు వేణు, సదానందం, రమాకాంత్, మల్లేష్, రాజేష్, భీమేష్, శ్రీనివాస్, జు బేర్, సంతోష్ గౌడ్, బాలయ్య,లక్ష్మయ్య ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News