Thursday, January 23, 2025

సర్జరీల తరువాత పాతికేళ్ల యువకుడికి తిరిగి నడక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో కాలువిరిగిన ఓ పాతికేళ్ల యువకుడు తిరిగి నడిచేలా చేశారు గురుగ్రామ్‌లోని మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు. ఏడాది క్రితం యువకుడు కాలికి ఫ్రాక్చర్ అయి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ దశలో ఆయనకు మోకాలి ప్రాంతంలో 5 సెంటిమీటర్ల మేర చర్మం, ఎముకలు కోల్పోవల్సి వచ్చింది. నడవలేని స్థితికి చేరాడు.

ఏడాది నుంచి ఈ ఆసుపత్రి వైద్యులు పలు సర్జరీలు జరిపి , ఈ క్రమంలో అనేక అధునాతన పరికరాలను అమర్చి, చర్మం, ఎముకలు సవ్యం అయ్యేలా చేయడంతో ఇప్పుడు ఆయన తిరిగి ఊతకర్ర సాయంతో తిరిగి నడిచే స్థితికి చేరాడని ఆసుపత్రి వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఏడాదిలో నాలుగు సర్జరీలు జరిగినట్లు వెల్లడించారు. ఎముకలు విరిగిన ప్రాంతంలో ఏర్పడ్డ ఖాళీలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన సర్జరీల క్రమంలో తిరిగి అతికేలా చేశారు. ముందు ఆయన ఊతకర్రలతోనే నడిచినా ఇప్పుడిప్పుడే సొంతంగా తిరిగి నడిచే స్థితికి చేరుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News