Friday, January 3, 2025

నడక ఆరోగ్యానికి మంచిది

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట అర్బన్: నడక ఆరోగ్యానికి మంచిదని మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 19,20 వార్డు పరిశుభ్రత మనందరికి మంచిదని నడుస్తూ చెత్త వేరుచేద్దామనే కార్యక్రమంలో పాలక వర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు ఉదయాన్ని వార్డులలో వాకింగ్ చేస్తూ రోడ్డుకు ఇరువైపులా అక్కడక్కడ గల పేపర్, కవర్‌లను తొలగించారు. నడక ఆరోగ్యానికి మంచిది పట్టణ పరిశుభ్రత మనందరికి మంచిదని ప్రతి రోజు వార్డులో నడుస్తూ చెత్త ఏరటం వలన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గం , అదికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News