Friday, December 20, 2024

నడక ఆరోగ్యానికి మంచిది

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: నడక ఆరోగ్యానికి మంచిదని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. మంగళవారం స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో భాగంగా ప్రతి రోజు 11 వార్డు చొప్పున చేపట్టిన కార్యక్రమం నడుస్తూ చెత్త వేరుచేయుట కార్యక్రమంలో వార్డులో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, వార్డు కౌన్సిలర్ దాసరి బాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి వార్డులో నడుస్తూ చెత్తను సేకరించించారు. మాట్లాడుతూ ప్రతి రోజు చెత్తను సేకరించే మున్సిపల్ వాహనం క్రమం తప్పకుండా వస్తుందా లేదా అని ప్ర జలను అడిగారు. ప్రతి రోజు నల్లాల ద్వారా మంచినీరు వస్తుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గల్లీలలో రోడ్ల పక్కన పెరిగినటువంటి పిచ్చి గడ్డిని తొలగించాలని చెప్పారు.పెంచుతున్నటువంటి కూరగాయలు, ఆకు కూరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల ర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News