Monday, December 23, 2024

నడక అన్ని విధాలుగా మేలు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : బంగారు తెలంగాణలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని అందుకు నిత్యం వ్యాయామం, నడక, ఈత ఎంతో ఉపకరిస్తోందని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళశారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన 2 కె కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ జెండా ఊపీ ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర వవార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. శశాంక, ప్రత్యేక అతిధులుగా జడ్పీ చైర్మైన్ కుమారి అంగోతు బిందు, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి తదితరులు హాజరైయ్యారు. డీజే సౌండ్‌లో ఉర్రూత లూగించిన తెలంగాణ పాటలతో పాటు పోలీసులు రూపొందించిన పాటలకు ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీలతో పాటు పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, వాకర్స్‌అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, విద్యార్థులు అంతా కలసి నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు.

అనంతరం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వరకు 2కె రన్‌లో వారంతా పాల్గొన్నారు. ఉత్సహభరితంగా, కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ భగస్వాములు కావడం విశేషం. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ అద్యక్షత ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ సాధించేందుకు మనమందరం అరోగ్య వంతులుగా అన్ని రంగాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ 2కె రన్‌లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. రన్‌లో పాల్గొన్న వారందరిచేత కలెక్టర్ జంబా డాన్స్ చేయించి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ.. నిత్యం నడకతో మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాలను పరిరక్షించుకున్న వారు అవుతారని చెప్పారు.

ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు నిత్యం వ్యాయామాలు, నడక సాగించాలని సూచించారు. ఫిట్‌నెస్ వల్లే ఉల్లాసంగా ఉంటామని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం మనుగడ సాధించాలని సూచించారు. జడ్పీ చైర్మైన్ కుమారి అంగోతు బిందు మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ నేతృత్వంలోని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని రంగల్లోనూ పురోగతిని సాధింస్తున మనం ఆరోగ్యంతో జీవన ప్రమాణాలను కూడా పొంపెందించుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసు శాఖ ప్రజలకు దగ్గరైందని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీసు శాఖ కూడా భాగస్వామ్యమవుతూ ప్రజాసేవలో ముందుందని పేర్కొన్నారు. యువతను ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దేందుకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీసు శాఖ పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కోలాటం, డప్పు కళాకారులు, పోతురాజు వేషాధారణలు, ఇతర కళాకారుల వేషధారణలతో యువత డిజె సౌండ్‌లో వచ్చే పాటలకు చేసిన జోరుగా నృత్యాలు చేస్తూ ర్యాలీకి మరింత ఊపునిచ్చారు. నర్సింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు ర్యాలీకి సరికొత్త ఉత్సాహాన్ని నింపడం విశేషం.

ఇంకా కార్యక్రమంలో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు రమేష్, రమణబాబు, డీఈవో పి. రామారావు, ఆర్డీవో డి.కొమురయ్య, మున్సిపల్ కమీషనర్ కట్టంగూరు ప్రసన్నరాణి, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి బి. అనిల్ కుమార్, ఉషాదయ, కాలోజీ, మిత్ర వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాద్యాయులు, ఉపాద్యాయులు, అద్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News