Wednesday, January 22, 2025

రాజ్యసభ నుంచి బిఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తాము ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను చైర్మన్ తిరస్కరించినందుకు నిరసనంగా బిఆర్‌ఎస్, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం), ఆప్ సభ్యులు బుధవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. బిఆర్‌ఎస్ సభ్యుడు కె కేశవరావు, ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్, శివసేన సభ్యులు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది రూల్ 267 కింద ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు సభ సమావేశమైన వెంటనే చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ ప్రకటించారు.

కాగా కేశవరావు లేచి నిలబడి తాము మంగళవారం సభను బహిష్కరించడంపై చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. అదానీ అంశంపై చర్చించేందుకు అనుమతించాలని సంజయ్ సింగ్ డిమాండు చేయగా నోటీసులను అనుమతించలేదని చైర్మన్ స్పష్టం చేశారు. దీంతో సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు బిఆర్‌ఎస్, ఆప్, శివసేన సభ్యులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News