Monday, December 23, 2024

నూతన స్పోర్ట్స్‌ కలెక్షన్‌ విడుదల చేసిన మెట్రో బ్రాండ్స్‌ వాక్‌వే..

- Advertisement -
- Advertisement -

వాక్‌వే షూస్‌ తమ తాజా స్పోర్ట్స్‌ కలెక్షన్‌ విడుదల చేసింది. సౌకర్యం, డిజైన్‌ను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన వాక్‌వే, ప్రతి ఒక్కరికీ ఖచ్చితమైన శ్రేణి ఫుట్‌వేర్‌ను సృష్టిస్తుంది. మరీ ముఖ్యంగా ఫిట్‌నెస్‌ కోసం తమ తొలి అడుగు వేయాలనుకునే వారికి ఇవి పూర్తి సౌకర్యం అందిస్తాయి. నూతన కలెక్షన్‌తో, వాక్‌వే షూస్‌ అత్యంత సౌకర్యవంతమైన శ్రేణి స్పోర్ట్‌ స్నీకర్లను స్త్రీ, పురుషుల కోసం విడుదల చేసింది. తరచుగా ప్రయాణాలలో ఉండటంతో పాటుగా చురుకైన జీవనశైలి కోరుకునే వారికి అనువుగా ఇవి ఉంటాయి. ఈ శ్రేణిని నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

‘‘మా వినియోగదారులకు వీలైనంత ఉత్తమ ఫుట్‌వేర్‌ను తమ ఫిట్‌నెస్‌ ప్రయాణ ప్రారంభ వేళ అందించాలన్నది మా లక్ష్యం’’ అని మనోజ్‌ సింగ్‌, బిజినెస్‌ హెడ్‌ –వాక్‌వే, మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌ అన్నారు. ‘‘వాక్‌వే షూస్‌, ఎవరికైనా సరే ఖచ్చితమైన షూస్‌గా నిలుస్తాయని మేము నమ్ముతున్నాము. మరీముఖ్యంగా తమ ప్రదర్శన మెరుగుపరుచుకోవడంతో పాటుగా ఫిట్‌నెస్‌ పట్ల తమ ప్రయాణం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నవారికి అనువుగా ఉంటాయి’’ అని అన్నారు.

స్పోర్ట్స్‌ ఫుట్‌వేర్‌లో ప్రతి జత తేలిగ్గా, సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్‌ను కలిగి ఉన్నాయి. వీటిలో బ్రీతబల్‌ మెష్‌ ఉండటం చేత గరిష్ట సౌకర్యం, మద్దతును వేసవిలో అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, శైలిలో లభ్యమయ్యే ఈ శ్రేణి పెర్‌ఫార్మెన్స్‌తో పాటుగా శైలి కోరుకునే వినియోగదారులు ఖచ్చితంగా కొనుగోలు చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ శ్రేణి 999 రూపాయలతో ప్రారంభమవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News