Wednesday, January 22, 2025

నీ కోపం పాడుగానూ.. రోడ్డుపై గోడ కడితే ఎలా?

- Advertisement -
- Advertisement -

ఎప్పుడో నలభయ్యేళ్ల కిందట వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో కొడుకుతో గొల్లపూడి గొడవ పడి, ఇంటి మధ్యలోనే గోడ కట్టేస్తాడు. ఇప్పుడు ఏపీలో అదే సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఇంట్లోకాదు, రోడ్డు మీదే గోడ కట్టేశాడొక ప్రబుద్ధుడు.

అసలు విషయం ఏంటంటే, పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో కిలారు చంద్రశేఖర్, కిలారు లక్ష్మీనారాయణ ఎదురెదురు ఇళ్లలో ఉంటారు. కొంతకాలంగా ఇద్దరికీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి ఇళ్లకూ మధ్యలో సిమెంట్ రోడ్డు ఉంది. చంద్రశేఖర్ ఈమధ్య తన ఇంటిముందున్న మురుగు కాల్వపై మెట్లు కట్టాడు. అంతే, లక్ష్మీనారాయణ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నువ్వు మురుగుకాల్వపై మెట్లు కడితే నేను రోడ్డుపైనే గోడ కడతానంటూ ఏకంగా సిమెంటు రోడ్డు మధ్యలో గోడ కట్టేశాడు. దీనిపై చంద్రశేఖర్ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News