Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. టిఎస్‌పిఎస్‌సి ఆఫీస్ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఒయు జెఎసి ఛైర్మన్ అర్జున్‌బాబు పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. ఇచ్చట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్నాపత్రాలు లభిస్తాయంటూ సెటైర్లు విసురుతూ పోస్టర్లు అతికించారు. తప్పు చేసిన టిఎస్‌పిఎస్‌సిని రద్దు చేయకుండా కేవలం పరీక్షను రద్దు చేయడం ఏంటి…?, శిక్ష ఎవరికి బోర్డుకా, విద్యార్థులకా?…ఇదీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు పోస్టర్లు అని పోస్టర్లలో రాశారు.

తప్పు చేసిన కమిషన్ బోర్డును రద్దు చేయాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. ప్రశ్నాపత్రాల లీకేజీలో ఆయన కుటుంబసభ్యుల పాత్ర లేదని చెప్పడానికి సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిఎస్‌పిఎస్‌సి బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని కోరారు. అలాగే నష్టపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని.. అప్పటి వరకు వారికి నెలకు రూ.10,000 చొప్పున ఇవ్వాలని అందులో కోరారు. కాగా టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News