Wednesday, January 22, 2025

సమాచారం మాకు బహుమతి మీకు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మంగపేట: సమాచారం మాకు, బహుమతులు మీకు అనే నినాదంతో నిశేధిత మావోయిస్ట్‌లను పట్టించాలని కోరుతు మంగళవారం మంగపేట పోలీసులు వాల్ పోస్టర్‌లను మంగపేట పరిదిలోని ఆయా ప్రాంతాలలో అంటించారు. మవోయిస్ట్ పార్టీ యాక్షన్ టీం ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తుందనే సమాచారం మేరకు యాక్షన్ టీం సభ్యులు అయిన కరుణాకర్, సుధాకర్, మహేందర్ ఫోటోలను ప్రచురించి వారిని పట్టించిన వారికి రూ. 5 లక్షల నుంచి రూ 20 లక్షల వరకు బహుమానాలను అందిస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా మంగపేట ఎస్సై తాహెర్ బాబా మాట్లాడుతు.. మండల పరిదిలో నిశేధిత మావోయిస్ట్‌ల సంచారం తెలుపాలని కోరుతు వాల్ పోస్టర్‌లను అంటించారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటుగా బహుమతులను అందజేయడం జరుగుతుందని అన్నారు. సమాచారం తెలిసిన వారు వాల్ పోస్టర్‌లలోని నంబర్‌లకు సమాచారం అందివ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News