Monday, December 23, 2024

బాక్సాఫీసుపై దండయాత్ర..

- Advertisement -
- Advertisement -

ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నారు. వీరిద్దరూ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతూ కోట్లు కొల్లగొడుతున్నాయి. అయితే, ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్సే. తాజాగా చిరు, బాలయ్య చిత్రాల కలెక్షన్స్ ను నిర్మాణ సంస్ణ ప్రకటిస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసింది.

ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి నాలుగు రోజుల్లో రూ.104 కోట్లు రాబట్టింది. యుఎస్ లోనూ ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంది. ఇక, వాల్తేరు వీరయ్య ఈ నెల13న విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.108 కోట్లు కొల్లగొట్టడంతోపాటు యుఎస్ లోనూ సత్తా చాటుతోంది. అక్కడ ఈ మూవీ 1 మిలియన్ మార్క్ దాటి 2 మిలియన్ డాలర్ల పైపు దూసుకుపోతోంది. దీంతో నిర్మాతలకు ఈ రెండు సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ ఈ సినిమాలు భారీగా కలెక్షన్స్ రాబట్టనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News