మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ’వాల్తేరు వీరయ్య’ ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో మెగామాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మాసీవ్ గా నిర్వహించింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “బాబీ ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌తో కథ చెప్పినపుడు వినగానే అద్భుతం అనిపించింది.
షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ సినిమా తప్పకుండా చేస్తున్నాం” అని అప్పుడే చెప్పాను. ఫస్ట్ వినగానే చాలా బావుంది అనుకునే కథలు నా కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను.. ‘వాల్తేరు వీరయ్య’చాలా బాగా ఆడుతుంది. ప్రతి ఒక్కరిని అలరించే సినిమా వాల్తేరు వీరయ్య. బాబీలో కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ కనిపిస్తారు. బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సయిన కమర్షియల్ సినిమా. సినిమాలో మొదటి ఇరవై నిమిషాల్లో హాలీవుడ్ స్థాయి ఎపిసోడ్స్ వుంటాయి. రవితేజ ఎంట్రీ తర్వాత సినిమా మరో స్థాయికి వెళుతుంది. ఈ పాత్రకు రవితేజ తప్పితే మరో నటుడు న్యాయం చేయలేడు. తను రావడం వలనే పాత్రకు న్యాయం జరిగింది. శ్రుతి హాసన్ చాలా చక్కగా చేసింది. తన పాత్రకు చాలా ప్రాధన్యత వుంటుంది. కేథరిన్‌ది ఇందులో కీలకమైన పాత్ర. చాలా చక్కగా తన పాత్రని పోషించింది. ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ సాంగ్‌ని చాలా ఎనర్జిటిక్‌గా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ప్రతి సాంగ్‌కి ప్రాణం పెట్టి మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అద్భుతమైన నేపధ్య సంగీతం చేశాడు”అని అన్నారు.
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ “వాల్తేరు వీరయ్య నటీనటులకు, సాంకేతిక నిపుణలందరికీ ఆల్ ది బెస్ట్ కాదు.. కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా బ్లాక్‌బస్టర్. పూనకాలు లోడింగ్. చిరంజీవితో నటించిన ప్రతి మూమెంట్ చాలా గర్వంగా వుంటుంది. ఆయన నన్ను ఎంతో ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అన్నయ్య ఎవరేమన్నా భరిస్తారు.. బాధపడతారేమో కానీ బయటపడరు. ఆయనలో వున్న గొప్ప లక్షణం అది. ఆయన ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. బాబీ ‘వాల్తేరు వీరయ్య’తో నెక్స్ లెవల్‌కి వెళ్తాడని నా గట్టి నమ్మకం”అని చెప్పారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ “ఇండస్ట్రీకి ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్యపై వున్న ప్రేమని ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి కథకు మాకు కావాల్సిన శక్తి మాస్ మహారాజా రవితేజ. చిరంజీవి, రవితేజ ఇద్దరూ స్వయంకృషితో వచ్చిన గ్రేట్ స్టార్స్. చిరంజీవి, రవితేజ కాంబినేషన్ కి నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను. దేవిశ్రీ ప్రసాద్ బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో నవీన్ ఎర్నేని, దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.