Monday, January 20, 2025

సంధ్య థియేటర్‌కు వచ్చిన చిరు కూతుళ్లు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడదలైంది. చిరు సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చిరు అబిమానులకు ఒక రోజు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చింది. వాల్తేరు వీరయ్య చూడటానికి మెగా అభిమానులు క్యూ కడుతున్నారు. డప్పులు, డ్యాన్సులతో థియేటర్‌ వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఎక్కడ చూసిన చిరు చిరు అంటూ కేకలు వేస్తున్నారు. ఈ సినిమా వీక్షించడానికి చిరు ఇద్దరు కూతుళ్లు ఆర్‌టిసి క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌ కు వచ్చారు. వారితో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్‌లు సినిమా హాలుకు వచ్చారు. దీంతో సందడి నెలకొంది. చిరు కూతుళ్లను చూడగా అభిమానులు కేరింతలు వేశారు. చిరు కూతుళ్లతో అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఈ రోజు ఉదయం నాలుగు గంటల షోకు డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్, చిరంజీవి కూతుళ్లు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News