Friday, December 20, 2024

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ కు పూనకాలే..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతిసారీ చిరంజీవి కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ లు అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరో సంచలన ఆల్బమ్‌ ను అందించాడు. ఆల్బమ్‌ లోని ‘బాస్ పార్టీ’, ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

డిసెంబర్ 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. న్యూ పోస్టర్ ను విడుదల చేశారు.. పోస్టర్‌ లో చిరంజీవి చేతిలో పోర్టబుల్ గ్యాస్ బర్నర్ పట్టుకుని కనిపించారు. ఈ గెటప్, చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకుని చేసిన యాక్ట్ ‘గ్యాంగ్ లీడర్‌’ ను గుర్తు చేస్తుంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News