Monday, December 23, 2024

‘వాల్తేరు వీరయ్య’ పవర్‌ఫుల్ తుఫాన్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ’వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ అభిమానులకు కావాల్సిన అంశాలన్నింటినీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫుల్ మీల్ ఫీస్ట్‌గా సిద్ధం చేస్తున్నాడు. ఇక సోమవారం ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ట్రాక్‌ని విడుదల చేశారు. ఈ టైటిల్ ట్రాక్ అన్ని వర్గాల మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా మాస్‌ని మైమరిపిస్తోంది. చంద్రబోస్ రాసిన ప్రతి పదం ఉరుములా వుంది. బలమైన లిరిక్స్‌తో పవర్‌ఫుల్ తుఫానును సృష్టిస్తోంది.

వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితంగా తెలియజేసింది ఈ సాంగ్. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News