Sunday, January 19, 2025

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గరుడ బస్సు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

వనపర్తి: చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను గరుడ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా మూమ్మాళ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. మృతులు బస్సు డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడిగా గుర్తించారు. బస్సు రోడ్డుపై నిలిచిపోవడంతో నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News