Friday, April 4, 2025

వనపర్తిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు సాధువులు మృతి

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు: వనపర్తి జిల్లాలో పెబ్బేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాధువులపైకి డిసిఎం దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. గుజరాత్‌కు చెందిన కొంతమంది సాధువుల పెబ్బేరు నుంచి కర్నూలు వైపు నడుచుకుంటు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ డిసిఎం అదుపుతప్పి వారిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News