Monday, December 23, 2024

వంద రూపాయలు కోసం భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం సేవించేందకు భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వనపర్తి జిల్లా రేపల్లి మండలం తలుపునూరు గ్రామానికి చెందిన స్వామి(45) అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం మద్యం తాగేందుకు వంద రూపాయలు ఇవ్వాలని భార్యను భర్త అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే మనస్థాపంతో భర్త ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News