Friday, December 20, 2024

కివీస్‌పై అలా చేస్తే గెలుస్తాం: కుల్దీప్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఈ వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ఆడనున్న నేపథ్యంలో భారత జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మీడియాతో ముచ్చటించారు. వాంఖేడ్ స్టేడియం ఎప్పుడు బౌలర్లకు సవాల్ విసురుతుందని తెలిపారు. కివీస్ టాప్ బ్యాట్స్‌మెన్ వికెట్లు త్వరగా తీస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. వాంఖేడ్ స్టేడియంలో న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడామని వివరించారు. వాంఖేడ్ స్టేడియం టీ20లో మాత్రం బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి తొలి స్థానంలో టీమిండియా ఉండగా న్యూజిలాండ్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి నాలుగో స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగులతో తేడాతో గెలిచింది. కుల్దీప్ తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి 4.15 ఎకనామీ రేటుతో ఐదు స్థానంలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News