Monday, December 23, 2024

ఆసిఫాబాద్ లో రోడ్డు ప్రమాదం: కుమారుడి మృతి… తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

వాంకిడి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్ పూర్ లోని క్రషర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిబిఎల్ కంపెనీకి చెందిన టిప్పర్, స్కూటీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సామెల గ్రామానికి చెందిన తులసీ రామ్ గా గుర్తించారు. కొడుకు మరణ వార్త వినగానే తులసీ రామ్ తండ్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికి చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఒకే రోజు రెండు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.  మృతి చెందిన తులసీ రామ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారు.

Also Read: ఆ కాలనీలో లుంగీలు, నైటీలతో బయట తిరగడం బ్యాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News