Tuesday, February 4, 2025

చికెన్ ఫ్రై కావాలి…చిన్నారి వీడియో వైరల్..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : “అంగన్వాడీలో ఉప్మాకు బదులు చికెన్ ఫ్రై కావాలి” అని కేరళకు చెందిన శంకు అనే చిన్నారి తన తల్లిని అడుగుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఆ వీడియోను శంకు తల్లి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అది కేరళ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి వీణాజార్జ్ దృష్టికి వచ్చి ఆమె స్పందించారు. ఇంట్లో బిర్యానీ తింటూ ఆ పిల్లవాడు ఈ కోరిక కోరాడు. శంకు ముద్దు మాటలను తల్లి వీడియో తీసి, పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. “ ఇప్పుడు పెడుతోన్న ఆహారాన్ని ఒకసారి పరిశీలిస్తాం. పోషకాహారం అందేలా ప్రస్తుతం వివిధ రకాల పదార్ధాలను అందిస్తున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ ద్వారా గుడ్లు, పాలు, అందించే పథకం విజయవంతంగా అమలవుతోంది’ అని మంత్రి మాట్లాడారు. ఇక శంకు వీడియోను చూసి నెటిజన్లు ముచ్చటపడ్డారు. అంగన్వాడీ పిల్లలకు మరింత మెరుగైన ఆహారం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News