Saturday, January 11, 2025

యూపిలో వాంటెడ్ క్రిమినల్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబీ జిల్లాలో మంగళవారం ఉదయం మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ గుర్ఫాన్‌ను పోలీస్‌లు హతమార్చారు. కౌషాంబీ జిల్లాలో మంగళవారం ఉదయం 5 గంటలకు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో గుర్ఫాన్ పోలీస్‌లకు ఎదురుపడ్డాడు. ఎదురెదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుర్ఫాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రతాప్ ఘడ్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ గుర్ఫాన్‌పై హత్య, చోరీలు వంటి మొత్తం 13 కేసులు ఉన్నాయి. పట్టిచ్చిన వారికి లక్ష ఇస్తామని గతంలో యూపి పోలీస్‌లు రివార్డు కూడా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News