Sunday, January 19, 2025

ఆఫ్రికాలో గ్యాంగ్‌స్టర్ గౌస్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కీలక వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెహమ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఈ చర్యకు దిగింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)లో కీలక నేత. బెంగళూరులో 2016 లో ఆర్‌ఎస్‌ఎస్ నేత రుద్రేష్ హత్యోందంతంలో గౌస్ నియాజీ నిందితుడు. ఈ హత్య అప్పట్లో సంచలనం కల్గించింది. ఈ నేరం తరువాత నియాజీ తరచూ పలు దేశాలలో నివాసాలను మారుస్తూ వచ్చాడు. అధికారులను తప్పుదోవపట్టించాడు. విచారణకు చిక్కకుండా తప్పించుకున్నాడు.

ఎప్పటికప్పుడు ఈ వ్యక్తి కదలికలను గమనిస్తూ గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్టు స్కాడ్ చురుగ్గా వ్యవహరిస్తూ ఈ వ్యక్తి సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ నియాకు చేరవేస్తూ వచ్చింది. చివరికి నియా సూచనల మేరకు దక్షిణాఫ్రికా అధికారులు స్పందించారు. తగు విధంగా నియాకు సహకరించడంతో ఎట్టకేలకు ఇప్పుడు ఈ నిందితుడు అరెస్టు అయ్యాడని వెల్లడైంది. దక్షణాఫ్రికాలోనే ఈ వ్యక్తిని వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే పూర్తి స్థాయివిచారణకు ఈ నిందితుడిని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ముంబైలో ఆయనను విచారిస్తారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News