Friday, January 10, 2025

అంతర్గత పోరులో మావోయిస్టు కమాండర్ మృతి

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో సిపిఐ(మావోయిస్టు) కమాండర్ ఒకరు అంతర్గత ఘర్షణలలో మరణించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. పాలము డివిజన్‌కు చెందిన జోనల్ కమాండర్ చోటూ ఖేన్వర్‌ను ఇతర మావోయిస్టులు చినడోహ ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలోని భీంపాల్ అడవుల్లో మంగళవారం హత్య చేసినట్లు వారు చెప్పారు. మృతుడి తలపై రూ. 15 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆ మారుమూల ప్రాంతానికి వెళ్లారని డిఐజి(పాలము రేంజ్) వైఎస్ రమేష్ తెలిపారు. ఖేన్వర్‌కు అనేక నేరాలతో సంబంధం ఉందని ఆయన చెప్పారు. హత్యకు గల కారణాన్ని నిర్ధారించుకోవడానికి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News