Saturday, December 21, 2024

ట్రక్‌లను తగులబెట్టిన కేసులో వాంటెడ్ నక్సలైట్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నారాయణ్‌పూర్ : గత ఏడాది అడవిలో ట్రక్కులను తగులబెట్టిన కేసుతో సంబంధం ఉన్న 50 ఏళ్ల నక్సలైట్‌ను ఆదివారం పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల నెల్నార్ ఏరియా కమిటీలో చురుకుగా పాల్గొనే జయ్‌లాల్ డోడీ గత ఏడాది జనవరిలో ఝారి గ్రామం సమీపాన గల అడవుల్లో మూడు ట్రక్కులను తగులబెట్టిన వారిలో ఒకడు. డిస్ట్రిక్టు రిజర్వుగార్డు ( డిఆర్‌జి), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) సంయుక్త బృందాలు రాయ్‌పూర్ టెక్నార్, ఝోరి గ్రామాల మధ్య డోడీని అరెస్టు చేయగలిగాయి. నిందితుడి నుంచి విల్లు, బాణాలు, మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News