Friday, December 27, 2024

ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ

- Advertisement -
- Advertisement -

'Wanted PanduGadu' Movie to release on Aug 19

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ఈ చిత్రం ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగిన ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ “సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది.

సీతారామం, బింబిసార్, కార్తికేయ 2 సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. థియేటర్స్‌లో వస్తున్న మా సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ కూడా హిట్ అవుతుంది” అని అన్నారు. అనసూయ మాట్లాడుతూ.. ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ “ప్రస్తుతం మూడు సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. రాఘవే్ంరద్రావు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా ముందు రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది”అని చెప్పారు.ఈ కార్యక్రమంలో సునీల్, సుడిగాలి సుధీర్, హరీష్ శంకర్, బి.వి.ఎస్.రవి, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, థర్టీ ఇయర్స్ పథ్వీ తదితరులు పాల్గొన్నారు.

‘Wanted PanduGadu’ Movie to release on Aug 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News