Sunday, January 19, 2025

కోరి సస్పెండ్ అయ్యారు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష ఎంపిలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి విసుర్లు

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అడ్డంకులు సృష్టించిన ప్రతిపక్షంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ నుంచి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. అయితే తమ సహచరులు కొందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత తమను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నారని చెప్పారు.

ఎంపీలను సస్పెండ్ చేయాలన్నది తమ అభిమతం కాదని, సభకు అడ్డంకులు కల్పించవద్దని వారిని అభ్యర్థించామని తెలిపారు. అయితే కొం దరు ఎంపీలపై చర్య తీసుకోవడంతో తమను కూడా సస్పెండ్ చేయాల న్న అభ్యర్థనలతో మిగిలిన ఎంపీలు కూడా ప్రభుత్వాన్ని వేడుకున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభలోకి ప్లకార్టులు తీసుకువచ్చి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఎంపీలపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వానికి చెందిన సభా నిర్వాహకులు ప్రతిపక్ష ఎంపీలకు తెలియచేశారని జోషి తెలిపారు. తాము కూడా క్రమశిక్షణను ఉల్లంఘిస్తామని, తమ ను కూడా సస్పెండ్ చేయాలని వారంతా ప్రభుత్వాన్ని కోరారని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News