Sunday, April 6, 2025

పేద ముస్లింలను అభివృద్ధిలోకి తీసుకరావడమే మా లక్ష్యం: కిరణ్ రిజిజు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్నామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బిల్లు గురించి విపక్షాలు వదంతులు ప్రచారం చేశాయని మండిపడ్డారు. లోక్‌సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు వచ్చింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్ సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిల్లులో లేని అంశాలను లేవనెత్తి ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని, పలుమార్లు చర్చల తరువాత 1995లో వక్ఫ్ చట్ట సవరణలు జరిగాయని, 1995లోనే ట్రైబ్యునల్ వ్యవస్థ ఏర్పాటైందని, వక్ఫ్ చట్ట సవరణ ప్రస్తావణ 2013లోనే మొదలైందని గుర్తు చేశారు.

గతంలో వక్ఫ్ బోర్డులో మహిళలను ఎందుకు చేర్చలేదని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, వక్ఫ్ బోర్డులో మరింత పారదర్శకత తీసుకురావాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. యుపిఎ హయాంలో వక్ఫ్ బోర్డును వర్గాలుగా ఎందుకు విభజించారని నిలదీశారు. గతంలో వక్ఫ్‌బోర్డుకు ఆదాయం చాలా తక్కువగా ఉండేదని, పేద ముస్లింలను అభివృద్ధిలోకి తీసుకరావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు ఆస్తులకు సంబంధించి ఏళ్ల తరబడి కోర్టులో కేసు నడిచిందని, 123 ఆస్తులను వక్ఫ్ బోర్డుకు యుపిఎ సర్కారు డీనోటిఫై చేసిందని, వక్ఫ్ బిల్లుపై విపక్షాల సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని కిరణ్ రిజిజు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News