Monday, May 12, 2025

ఇది రాజ్యాంగ ఉల్లంఘన… వేలాది మందితో కిక్కిరిసిన దారుస్సలాం

- Advertisement -
- Advertisement -

వక్ఫ్ సవరణ చట్టాన్ని నిర్దందంగా తిరస్కరించిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్
వేలాది మందితో కిక్కిరిసిన దారుస్సలాం బహిరంగ సభాస్థలి

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తిరస్కరించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శనివారం ఎంఐఎం హెడ్‌క్వార్టర్ దారుస్సలాంలో బహిరంగ సభ జరిగింది. నగరం నుండే గాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన వేలాదిమందితో ఆ ప్రాంగణం కిక్కిరిసింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు, ముస్లిం మత పెద్దలు, మేధావులు, ఎంఐఎం నేతలు పాల్గొని వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు. కేంద్ర చర్యను వ్యతిరేకిస్తూ దేశ వాప్యంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు తెలిపారు.

ఎంఐఎం అధ్యక్షులు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరాన్ని నేతలు నొక్కి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న రాత్రి 9 గంటలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో పది నిమిషాలు లైట్లన్నీ అర్చివేసి నిరసన తెలుపడం, మే 18న నగరంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Waqf Amendment Act

ఈ సమావేశాలకు స్థానిక మైనారిటీ బాధ్యలు, సెక్యులర్ నాయకులు మొదలైన వారు పాల్గొనేలా చేయాలని సూచించారు. మే 22న హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లో మహిళా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే 25న రెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు నగరంలోనూ, అన్ని జిల్లాలలోనూ మానవహారం నిర్వహించి నిరసన తెలుపాలని, జూన్ ఒకటిన నగరంలో జరిగే ధర్నాలో తమ తమ సౌలభ్యాన్ని బట్టి, స్తోమతను బట్టి రెండు రాష్ట్రాల ప్రతినిధుల పాల్గొనాలని, నగరంలో జరిగే ఈ ధర్నాలో పురుషులు, స్త్రీలు అందరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, జహీరాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల,కామారెడ్డి తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పెర్కొన్నారు. సుల్తానా అడ్వకేట్ గారి సెల్ నెంబర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News