Monday, December 16, 2024

వక్ఫ్ సవరణ బిల్లు: ప్యానెల్ ముందుకు స్టేక్ హోల్డర్స్, విపక్షం వాకౌట్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ సెక్రటేరియట్ బిల్లుపై ప్రజల సూచనలను ఆహ్వానించింది

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ రెండవ సమావేశం శుక్రవారం ఎనిమిది గంటలకు పైగా కొనసాగింది, ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడం కూడా జరిగింది, కానీ తరువాత “అధికార పక్షం ఎంపీలు తమ మాట వినడానికి సిద్ధంగా లేరు” అని పేర్కొన్నారు.

బిల్లులోని ప్రతిపాదిత నిబంధనలలో ఒకదానికి అనుకూలంగా బిజెపి సభ్యుడు మాట్లాడుతుండగా సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ప్రతిపక్షాలు తమలో ఒకరిని జోక్యం చేసుకోవడానికి అనుమతించలేదని చెప్పడంతో వారు నిరసనగా వాకౌట్ చేశారు. కానీ నిమిషాల తర్వాత వారు తిరిగి వచ్చారు, సమావేశం తిరిగి ప్రారంభమైంది. పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాలు విశేషమైనవి, సమావేశాల సమయంలో సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాల వివరాలు గుప్తమైనవి. 1995 వక్ఫ్ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తున్న ముస్లిం సంస్థలు, వక్ఫ్ బోర్డు ప్రతినిధుల సూచనలను కమిటీ శుక్రవారం ఆహ్వానించింది.

జాయింట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న బిజెపి ఎంపీ జగదాంబికా పాల్, స్టేక్ హోల్డర్ల నుండి మౌఖిక సాక్ష్యాలను విన్నామని చెప్పారు. ‘ఎక్ప్’ లో తన పోస్ట్‌ లో, పాల్ స్టేక్ హోల్డర్లలో ఆల్ ఇండియా సున్నీ జమియాతుల్ ఉలమా ముంబై , ఇండియన్ ముస్లింస్ ఫర్ సివిల్ రైట్స్ (IMCR) ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు , రాజస్థాన్ ముస్లిం వక్ఫ్ ఉన్నారని తెలిపారు.

బిజెపి మిత్రపక్షాలు జెడి (యు), ఎల్ ఐపి(రామ్ విలాస్) , తెలుగు దేశం పార్టీ ఇప్పటివరకు “తటస్థ” వైఖరిని తీసుకున్నాయి , వీటిలో కనీసం రెండు పార్టీలు ముస్లిం సంస్థలు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిష్కరించాలని కోరుతున్నాయి.

లోక్‌సభ సెక్రటేరియట్ కూడా శుక్రవారం  బిల్లుపై సూచనలను ఆహ్వానించింది. “సాధారణంగా ప్రజల నుండి అభిప్రాయాలు/సూచనలతో కూడిన మెమోరాండాలు , ప్రత్యేకించి ఎన్ జివో లు/నిపుణులు/స్టేక్‌హోల్డర్లు , సంస్థలు”  సూచనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News