- Advertisement -
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం పలువురు ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. ప్యానెల్ నియమాలు , నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, డిఎంకెకు చెందిన ఎ రాజా, శివసేన (యుబిటి) అరవింద్ సావంత్, ఎఐఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ, సంజ్‌వాదీ పార్టీకి చెందిన మొహిబ్బుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ వంటి ప్రతిపక్ష ఎంపీలు ప్రొసీడింగ్స్ పై విరుచుకుపడ్డారు.
విపక్ష సభ్యులు తమ తదుపరి కార్యాచరణను నిర్ణయించడానికి తరువాత ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వారిలో ఇద్దరు లోక్‌సభ స్పీకర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ప్రముఖ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వంలోని కమిటీ దాని కార్యకలాపాలను కొనసాగించింది.
- Advertisement -