Sunday, February 23, 2025

దర్గాల ఆదాయం దళారుల పాలు

- Advertisement -
- Advertisement -

16భారీగా పడిపోయిన వక్బ్‌బోర్డు ఆదాయం
ఆందోళన వ్యక్తం చేస్తున్న మైనారిటీ సంఘాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : 16 వచ్చిన తర్వాత వక్ఫ్‌బోర్డులో రాజకీయ జోక్యం పెరిగిందని, దీని వల్ల పాలన అస్తవ్యస్తం అయ్యిందని మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దరమిలా దర్గాల ఆదాయం దళారుల పాలు అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. గతంతో పోల్చితే వక్ఫ్ బోర్డు ఆదాయం భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. దర్గాల హుండీలను ప్రతి ఏడు వేలయం వేయడం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. తద్వారా వక్ఫ్ బోర్డుకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది.

అయితే గత ఏడాదిన్నర కాలంగా కొన్ని దర్గాలకు కాంట్రాక్టు పరిమితి ముగిసినా వేలయం వేయకుండా స్థానిక నేతలకు అప్పగించడం వల్ల వక్ఫ్ ఆదాయానికి గండి పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫేన్ దర్గా మాత్రమే వక్ఫ్‌బోర్డు నిర్వహణలో ఉంది. మిగితా ప్రధాన దర్గాల హుండీలను వేలం వేసే ఆనవాయితీ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎల్‌ఎలు, మంత్రులు, అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల ప్రమేయంతో దర్గాల నిర్వహణ అస్తవ్యస్తం అయ్యిందని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీల నేతలు తమ తమ వర్గీయులకు దర్గాల నిర్వహణ, హుండీలను అప్పగించడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయం వారి జేబుల్లోకి వెళుతోందని, మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ దర్గా హుండీ వేలం ద్వారా ఏటా రూ. 4 కోట్లకు తగ్గకుండా వక్ఫ్‌బోర్డుకు ఆదాయం సమకూరేది, గత ఏడాదిన్న ర క్రితమే కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియడంతో మళ్లీ వేలం వేయకుండా అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలకు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వక్ఫ్‌బోర్డు ఆదాయం 50 లక్షలకు పడిపోయింది. అంటే బోర్డుకు మూడున్నర కోట్లు నష్టం వస్తుందని అసోసియేషన్ ఆఫ్ సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇఫ్తెఖార్ హుస్సేన్ తెలిపారు. సూర్యాపేట్ జాన్‌పాక్ షరీఫ్ దర్గా హుండీ వేలం వేయకుండా స్థానిక మైనారిటీ యేతర వ్యక్తికి అప్పగించినట్లు ఆయన ఆరోపించారు.

దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందన్నారు. ఈ దర్గా నుండి ఏటా దాదాపు రెండున్నర కోట్ల ఆదాయం వక్ఫ్ బోర్డుకు వచ్చేది. అది కాస్త రూ. 40 లక్షలకు పడిపోయిందని తెలుస్తోంది. వరంగల్‌లోని అన్నారం దర్గా, జహాంగీర్ పీర్ దర్గాల పరిస్థితి కూడా దిగజారుతోందని విమర్శలు వస్తున్నాయి. ప్రధాన దర్గాల ద్వారా వక్ఫ్‌బోర్డుకు ఏటా దాదాపు 12 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అది కాస్త రెండు కోట్లకు పడిపోయిందని తెలుస్తోంది. వక్ఫ్‌బోర్డు పాలకమండలి వ్యవహారంపై కూడా విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నేతల చెప్పుచేతుల్లో పాలకమండలి బొమ్మలా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంలో కేవలం ఒకే సారి సమావేశమైన బోర్డు పాలకమండలి రహస్యంగా సమావేశం మై నిర్ణయాలు తీసుకుందని, ఆ నిర్ణయాలపై అనేక అనుమానాలు ఉన్నాయని మైనారిటీ సంస్థలు పేర్కొంటున్నాయి.

వక్ఫ్ బోర్డు రాజకీయ జోక్యంతో పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఆరోపిస్తున్నాయి. వక్ఫ్‌బోర్డు పాలకమ ండలిని రద్దు చేయాలని ఒక స్వచ్చంద సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తక్షణమే బోర్డు పాలక మండలిని రద్దు చేయాలని, వక్ఫ్‌బోర్డు నిర్ణయాలపై ఉన్నత స్థాయి విచారణ జరుపాలని మైనారిటీ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. బోర్డు అధికారులు తీసుకుంటున్న స్వీయ నిర్ణయాలు ఆదాయాన్ని గండి కొట్టేలా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బోర్దు నిర్ణయాల వల్ల ప్రైవేటు వ్యక్తులు దర్జాగా దర్గాల ఆదాయాన్ని దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. షాద్‌నగర్‌లోని జహాంగీర్ పీర్ దర్గా, నిజామాబాద్‌లోని సయ్యద్ షాదుల్లా హుస్సేని దర్గా, వరంగల్ జిల్లాలోని యాఖుబ్ షహీద్ దర్గా, సూర్యపేటలోని జాన్‌పాక్ దర్గా, హైదరాబాద్‌లోని నాంపల్లి యూసుఫేన్ దర్గాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో ఈ దర్గాలకు భారీగా ఆదయం వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News