Monday, January 20, 2025

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ ‘వార్ 2’ రిలీజయ్యేది ఆ రోజునే!

- Advertisement -
- Advertisement -

హృతిక్ రోషన్ తో కలసి ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’పై ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ భారీ ఖర్చుతో రూపొందిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ తోపాటు కియారా అడ్వాణీ కూడా నటిస్తున్నారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా 2019లో విడుదలైన ‘వార్’ మూవీకి ఇది సీక్వెల్.

మూవీ రిలీజైన వారం రోజుల్లోనే 200 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ, ఆ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ‘వార్ 2’ మూవీని 2025 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణ సారథ్యంలో వరుసగా రూపుదిద్దుకుంటున్న స్పై మూవీలలో ఇది ఆరవది. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ వరసగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 వంటి స్పై మూవీలను నిర్మించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News