Sunday, January 19, 2025

ఆయుధాలు వదిలేస్తే…బందీలను వదిలేస్తే.. యుద్ధం రేపటికల్లా ఆగిపోతుంది: నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: హమాస్ చీఫ్ ,  అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్  హత్యను ఇజ్రాయెల్ ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత, , ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, హమాస్ ఆయుధాలు వదిలేయడానికి, బందీలను వదిలేయడానికి అంగీకరిస్తే రేపటికల్లా యుద్ధం ఆపేస్తామన్నారు.

ఎక్స్‌ లో ఒక వీడియోను పంచుకుంటూ, నెతన్యాహు, “యాహ్యా సిన్వార్ చనిపోయాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ధైర్య సైనికులచేత అతను రఫాలో చంపబడ్డాడు. ఇది గాజాలో యుద్ధం ముగింపు కాదు, ఇది ముగింపు ప్రారంభం. గాజా ప్రజలారా, నాదొక సాధారణ సందేశం – హమాస్ తన ఆయుధాలను వదిలి, మన బందీలను తిరిగి ఇస్తే ఈ యుద్ధం ముగియవచ్చు” అన్నారు.

హమాస్ చేతిలో, ప్రస్తుతం గాజాలో 101 మంది బందీలుగా ఉన్నారని, ఇందులో ఇజ్రాయెల్‌ సహా 23దేశాల పౌరులు ఉన్నారని నెతన్యాహు వెల్లడించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News