మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్దాన్ని ఇప్పట్లో ఆపేది లేదని రష్యా తెగేసి చెప్పింది అన్ని లక్ష్యాలు నెరవేరేవరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ప్రకటించింది. ఆరోరోజు జరిపిన దాడుల్లో ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నగరం భీతావహంగా మారిన నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ మంగళవారం ఈ ప్రకటన చేశారు. యూరప్ నుంచి అణ్వాయుధాలను అమెరికా ఉపసంహరించాలని సెర్గీ లవ్‌రోవ్ డిమాండ్ చేశారు. లక్షాలు నెరవేరేవరకు ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యా సేనలు క్షిపణులను ప్రయోగించాయి. ఈ నగరంపై జరిగిన కాల్పుల్లో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో చేరాలనే యోచన లేదని బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మంగళవారం చెప్పారు. తమ గడ్డపై నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడుతున్నాయనే ఆరోపణలను ఖండించారు.
అన్ని లక్ష్యాలు నెరవేరేవరకు యుద్ధం ఆపేదిలేదు : రష్యా
- Advertisement -
- Advertisement -
- Advertisement -