Monday, December 23, 2024

కశ్మీర్‌పై యుద్ధం వద్దు.. చర్చలు కీలకం: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్యపై యుద్ధం పరిష్కార మార్గం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. భారతదేశంతో పాకిస్థాన్ శాశ్వత శాంతిని కోరుకుంటుంది. ఈ దిశలో సంబంధిత జటిల సమస్యల పరిష్కారాన్ని ఆశిస్తుంది. ఇవన్నీ కూడా కేవలం సంప్రదింపుల ప్రక్రియతోనే సాధ్యం అవుతాయి. ప్రత్యేకించి కశ్మీర్ సమస్యకు పరిష్కారం చర్చలతోనే వీలు అవుతుంది. యుద్ధం వల్ల ప్రయోజనం లేదని షరీఫ్ తెలిపారు. హార్వార్డ్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థుల బృందంతో పాక్ ప్రధాని మాట్లాడారు. కశ్మీర్‌కు ఐరాస తీర్మానాలకు అనుగుణంగా స్పందన కీలకం, దీనితోనే ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతి నెలకొంటుందని తెలిపారు. కశ్మీర్ విషయం పరిష్కారం అయితేనే ఇతర అంశాల పట్ల సామరస్యం కుదురుతుందని ముందు ఈ విషయంపై ఆలోచించాల్సి ఉందన్నారు.

War is not a Solution to Kashmir Issue: Pakistan PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News