Monday, January 20, 2025

దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది: రాహుల్

- Advertisement -
- Advertisement -

పాట్నా: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా బిజెపిని ఓడించనున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్షాల ఐక్య సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తూ భారత్‌ను ముక్కలు చేసి, విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసి దేశాన్ని పాలించాలని బిజెపి ప్రయత్నిస్తోందని, దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.

ఒక పక్క కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో సిద్ధాంతంతో ముందుకు సాగుతుంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి శక్తులు భారత్ థోడో సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేమని, కేవలం ప్రేమతోనే ఓడించగలమని ఆయన అన్నారు. దేశాన్ని ఏకం చేసి ప్రమేను పంచడానికి కాంగ్రెస్ కృషిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ డిఎన్‌ఎ బీహార్‌లో ఉన్న కారణంగానే తాము పాట్న సమావేశానికి వచ్చామని రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇక్కడకు వచ్చాయని, 2024 లోక్‌సభ కెన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి బిజెపిని ఓడిస్తాయని ఆయన ప్రకటించారు.

కర్నాటకలో బిజెపి నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రమంతా తిరిగారని, కాని ఫలితం ఎలా ఉందో అందరూ చూశారని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సమైక్యంగా నిలబడిన మరుక్షణం కర్నాటకలో బిజెపి అద్యమైపోయిందని ఆయన చెప్పారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా బిజెపి కనుమరుగైపోతుందని ఈ వేదిక నుంచి తాను ప్రకటిస్తున్నానని రాహుల్ తెలిపారు. ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం ఖామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News