Saturday, December 21, 2024

ఆర్మూర్‌లో ‘వార్ వన్ సైడ్’

- Advertisement -
- Advertisement -

మాక్లూర్: మండలంలోని గొట్టిముక్కలలో ఆర్మూర్ నియోజకవర్గంలో వార్‌వర్ సైడ్ అని, కారు జోరునాపడం ఎవరి తరం కాదని పియుసి చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా బుధవారం మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం గ్రామంలోకి అడుగుపెట్టిన జీవన్‌రెడ్డికి ప్రజలు డప్పు వాయిధ్యాలు, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.

గ్రామ వీధుల్లో జై జీవనన్న, జైజై కెసిఆర్, జై తెలంగాణా నినాదాలతో గొట్టి ముక్కల గ్రామ వీధులు మారుయోగాయి. గ్రామమంతా కలియ తిరుగుతూ అందరిని పలకరిస్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ అందరితో మమేకమయ్యారు. గ్రామంలో అందుతున్న తాగునీరు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలవురు స్థానికంగాఉన్న సమస్యలను ప్రస్తావించగా ఆయన వాటిని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం గ్రామ ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి గొట్టిముక్కల గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అన్ని పనులుసత్వరం పూర్తి చేయాలని సూచించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఊరూరా జై కెసిఆర్ అని నినదిస్తోందన్నారు. వాడవాడకూ అండగా గులాబీ జెండా చల్లగా నీడనిస్తుందన్నారు. కెసిఆర్‌ది జనరంజక పాలన, ప్రగతిపథంలో పల్లెలు పురోగమిస్తున్నాయి, సంక్షేమ సంబురాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఆధునీకరించిన డ్రైనేజీలు,ప్రకృతివనలు, నర్సరీలు, సిసి రోడ్లు, సకల వసతులతో వైకుంఠ ధామాలు, చెత్తను తొలగించే ట్రాక్టర్లు లేని పల్లెలు లేవని, పరిసరాలపరిశుభ్రత, మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి వంటి పనులతో కళకళలాడుతున్నాయన్నారు. గొట్టిముక్కల గ్రామంలో 564 మందికి ప్రతి నెల ఒక్కొక్కరికి 2016 చొప్పున ఇప్పటివరకు 11లఞల 58వేలు వస్తున్నాయని, ఇప్పటివరకు మొత్తం రూ.17కోట్ల 94లక్షల పెన్షన్ రూపంలలో లబ్ధిదారులకు చేరాయి.

వికలాంగులకిచ్చే పెన్ఫషన్లు రూ.3016 నుంచి 4016కు పెంచామ అన్నారు. కళ్యాణలక్ష్మీ ద్వారా ఒక్కొక్కరికి ఒక లక్ష 1,116 చొప్పున 75మంది ఆడబిడ్డలకు అందించి పెండ్లిళ్లు చేశామని తెలిపారు. ఈ గ్రామంలోని 3వేల ఎకరాల భూమికి రైతు బంధు స్కీం ద్వారా రూ.10వేల చొప్పున ఏడాదికి 6 కోట్ల 36లక్షలు 861 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయన్నారు. గ్రామ ంలో అనారోగ్యం భారిన పడుతున్న 60మందికి సిఎంఆర్ ద్వారా 5వేల నుంచి 5క్షల వరకు ఆర్థిక సాయం అందించామని, వివిధ కారణాలతో చనిపోయన 18మంది రైతుల కుటుంబాలు రైతు బీమా ద్వారా 5లక్షల చొప్పున పరిహారం చెల్లించామన్నారు. యాదవ సోదరులకు 10గొర్రెల యూనిట్లుచ్చాం, గ్రామంలోనూ గృహలక్ష్మి ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి 3లక్షల చొప్పున మంజూరుచేయబోతున్నామని ఎంఎల్‌ఏ చెప్పారు.

అలాగే సిఎం కెసిఆర్ కొత్తగా బిసి వర్గాలకు చెందిన 15 కులాల వారికి లక్ష చొప్పున ఆర్థిక చేయూతనందిస్తామని, గ్రామానికి చెందినమహిళలకు ఆర్మూర్ 100 పడకల దవాఖాణాలో ఉచిత ప్రసవాలు జరిపించి, రూ.12వేలు, ఆడపిలల్ల పుడితే అదనంగా వెయ్యి రూపాయలతోపాటు ఆరోగ్య సంరక్షణకుగాను కెసిఆర్ కిట్‌లు అందిస్తున్నామని అన్నారు. గొట్టిముక్కలలో సిసి రోడ్డుకు రూ.90లక్షలు మంజూరు చేశామని, కుల సంఘ భవనాల నిర్మాణం కోసం వంజరి సంఘానికి రూ.3లక్షలు, మున్నూరుకాపు సంఘానికి రూ. 5లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి చెప్పారు.

ఈ గ్రామంలో అనేక అభివృద్ధిపనులు చేపటామన్నారు. గ్రామంలో పనికిరాకుండా పాడుబడిపోయిన బావులను పూడ్చివేయించడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరా వైర్లను మార్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజీపీలు అభివృద్ధికి వ్యతిరేకులన్నారు. గ్రామాల్లోకి బిజెపి, కాంగ్రెస్ నాయకులు వస్తే తరిమికొట్టాలి గ్రామస్తులకు తెలిపారు.
బిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి నేత : గొట్టిముక్కల గ్రామ బిజెపి వార్డు మెంబర్ గంగారెడ్డి ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు బిఆర్‌ఎస్ గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఎంపిపి మాస్త ప్రభాకర్, వైస్ ఛైర్మన్ సుక్కి సుధాకర్, గ్రామ సర్పంచు ప్రవీన్, ఎంపిటిసి రవి, పలువురు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News