హైదరాబాద్: పేలుడు ప్రసక్తే ఉండని రీతిలో బ్లాస్ట్ ప్రూఫ్ గ్యాస్ సిలిండర్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) రూపొందించింది. ఇండేన్ పేరిట ఐఓససిఎల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ రూపొందించిన కొత్త సిలిండర్ ఎలాంటి పరిస్థితిలోనూ పేలదట. సాధారణంగా గృహ వినియోగం కోసం మనం వాడుతున్న సిలిండర్లలో 14 కేజీల గ్యాస్ వస్తుండగా… ఈ బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్ మాత్రం 10 కేజీల్లో మాత్రమే లభ్యమవుతుందట. ఈ సిలిండర్‌ను సోమవారం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మేయర్ గుండు సుధారాణి ఆవిష్కరించారు.
! బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ సిలెండర్ ఆవిష్కరణ !
• ఐఓసి. నూతనంగా రూపొందించిన సిలిండర్.
బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ సిలెండర్ (10 కి.గ్రా) ను ఈరోజు @MC_GWMC ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. @KTRTRS pic.twitter.com/9B9hO0dJ8F
— Gundu SudhaRani, GWMC MAYOR (@SudhaRani_Gundu) July 11, 2022